అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mexico Earthquake 7.4 | మెక్సికో Mexico దక్షిణ పసిఫిక్ తీరానికి సమీపంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదైంది. భూకంప కేంద్రం మెక్సికోలోని ప్యూర్టో మడెరో (Puerto Madero) పట్టణానికి పశ్చిమ-దక్షిణ (WSW) దిశగా సుమారు 71 కిలోమీటర్ల దూరంలో నమోదైంది.
Mexico Earthquake 7.4 | ప్రభావం ఎక్కువే..
భారత కాలమాన ప్రకారం.. భూకంపం 2026 జులై 17న రాత్రి 8 గంటల 18 నిమిషాలకు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. దీని కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉండటంతో ప్రకంపనలు విస్తృత ప్రాంతంలో తీవ్రంగా అనిపించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Dr. Anil Menon | అంతరిక్షంలోకి మరో ఇండియన్.. ఎవరంటే..!
Mexico Earthquake 7.4 | నష్టం అంచనాలు..
భూకంప కేంద్రం అక్షాంశం 14.400° ఉత్తరం, రేఖాంశం 93.000° పడమరగా నమోదైంది. భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎంత మేరకు సంభవించిందనే అంశంపై అధికారులు ఇంకా పూర్తి సమాచారం వెల్లడించలేదు.
సముద్ర ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం నేపథ్యంలో సునామీ ప్రమాదంపై సంబంధిత సంస్థలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రజలు అధికారిక హెచ్చరికలు, సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.