Johnny Master Show Cause | జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ షాక్!

ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్​కు ఫెడరేషన్​ షాక్​ ఇచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Johnny Master Show Cause | ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్​కు ఫెడరేషన్​ షాక్​ ఇచ్చింది. నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

తెలుగు ఫిల్మ్ డాన్సర్స్‌ (Telugu Film Dancers) అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వ అంశాల్లో ఇటీవల జానీ మాస్టర్​, శేఖర్​ మాస్టర్​ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్​ భార్య  సుమలతపై డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది రాజీనామాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఫెడరేషన్​ ప్రతినిధులు శుక్రవారం సమావేశం అయ్యారు.

Johnny Master Show Cause | సహాయ నిరాకరణ

జానీ మాస్టర్​ తీరుపై ఫెడరేషన్​ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయనపై తక్షణమే సహాయ నిరాకరణ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 12న ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) ప్రతిష్ఠను దెబ్బతీసేలా జానీ మాస్టర్ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఫెడరేషన్ సీరియస్ అయింది. 14న విచారణకు పిలిచినా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వివరణ ఇచ్చే వరకు డ్యాన్సర్ అసోషియేషన్, జానీ మాస్టర్​కు సహకరించకూడదంటూ అనుబంధ సంఘాలకు ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది.

దీనిని కూడా చదవండి : H Fast Inspection | ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *