అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Youth Sangrama | కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ నిర్వహిస్తున్న ‘యువ సంగ్రామ సదస్సు’కు యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
BRS Yuva Sangrama Sabha | బీఆర్ఎస్కు షాక్.. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ
KTR Youth Sangrama | యువత గొంతుకను బలంగా వినిపిద్దాం
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం (జులై 18) ఉదయం 10 గంటలకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొంటూ, యువత తమ హక్కుల కోసం ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
“కలిసి నడుద్దాం.. యువత గొంతుకను బలంగా వినిపిద్దాం” అంటూ యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దఎత్తున సదస్సుకు తరలిరావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, యువజన నాయకులు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
