అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mexico Earthquake 6.0 | మెక్సికో దక్షిణ పసిఫిక్ Pacific తీరానికి సమీపంలో శుక్రవారం మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. అంతకుముందు ఇదే ప్రాంతంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, కొద్దిసేపటికే ఈ ప్రకంపనలు నమోదవడం గమనార్హం.
భారత కాలమాన ప్రకారం.. ఈ భూకంపం 2026 జులై 17న రాత్రి 8:50:06 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం ప్యూర్టో మడెరో (Puerto Madero) కు నైరుతి (SW) దిశగా సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడైంది.
Mexico Earthquake 6.0 | వరుస భూకంపాలతో ఆందోళన
భూకంప కేంద్రం 14.237° ఉత్తర అక్షాంశం, 93.093° పడమర రేఖాంశం వద్ద, భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ భూకంప వివరాలను సంబంధిత భూకంప పరిశీలనా సంస్థ సమీక్షించి (Reviewed) ధృవీకరించింది.
ప్రస్తుతం ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే వరుస భూకంపాల నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. కాగా, వరుస భూకంపాల నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
Mexico Earthquake 6.0 | తీవ్రంగానే మొదటి భూకంప ప్రభావం
ప్రాథమిక అంచనా ప్రకారం.. 7.4 తీవ్రతతో నమోదైన మొదటి భూకంపం ప్రభావం విస్తృత ప్రాంతాలపై పడినట్లు తెలుస్తోంది. భూకంప ప్రకంపనలకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని భూకంప పరిశీలనా సంస్థ వెల్లడించింది. దీనికితోడు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
తక్కువ లోతులో (10 కి.మీ.) సంభవించిన ఈ భూకంపం కారణంగా మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ బలమైన ప్రకంపనలు నమోదైనట్లు సమాచారం.