అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Surekha Challenge | వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్ర రూపం దాల్చింది. ఇటీవల స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కడియం వ్యవహారంపై ఇప్పటికే మంత్రి సురేఖ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సీఎంకు లేఖ రాశారు. గురువారం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. కడియం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలన్నారు. లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో ఉండాలని హితవు పలికారు.
Konda Surekha Challenge | ఆయన వచ్చాకే వివాదాలు
కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజీనామా చేయాలని కొండా సురేఖ హితవు పలికారు. శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలు అయ్యాయన్నారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండటంతో ఎమ్మెల్యే పదవిలో ఉండలేకపోతున్నారన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే, మంత్రి పదవి తెచ్చుకోవాలని సవాల్ చేశారు.
Konda Surekha Challenge | గెలిచి చూపించాలి
దేవాదాయ శాఖ అధికారులతో శ్రీహరి సమీక్ష నిర్వహించినట్లు ఆయన పీఆర్వో ప్రెస్‌కు రిలీజ్ చేసిన మినిట్స్‌లోనే స్పష్టంగా ఉందన్నారు. ఈ వ్యవహారంపై 14వ తేదీన మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. శ్రీహరి తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటూ బిడ్డను మాత్రం కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిపించుకున్నారని విమర్శించారు. నిజాయితీ, విలువలు ఉంటే కడియం రాజీనామా చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలన్నారు.
ఇది కూడా చదవండి..: Fee Reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై క్లారిటీ..హైకోర్టులో ప్రభుత్వం కీలక హామీ