ST welfare Telangana | రెండున్నరేళ్లుగా హామీలు అమలు చేయని కాంగ్రెస్

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: ST welfare Telangana | ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ అన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​లో సోమవారం మాట్లాడారు. ఈనెల 26న ఇందిరాపార్క్​లో(Indira Park) నిర్వహించే మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు.

ST welfare Telangana | చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ మాటేమైంది..

ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ (SC ST Declaration) ప్రకటించారన్నారు. డిక్లరేషన్​లో 12 హామీలు ఇచ్చారని, రెండున్నరేళ్లయినా ఆ హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. ఎస్టీలకు సేవాలాల్ కార్పొరేషన్ (Sevalal Corporation) ఏర్పాటు చేస్తామన్నారని, గోండు, కోయలకు కొమురంభీం కార్పొరేషన్, ఎరుకలకు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.750 కోట్లు కేటాయిస్తామన్నారని తెలిపారు. రాష్ట్రంలోని మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో మైదాన ప్రాంతాల్లో ఐదు ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామన్నారని, వీటి ద్వారా గిరిజనుల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయిస్తామన్నారన్నారు. కాని ఒక్కహామీనీ ఇప్పటివరకు నెరవేర్చకపోవడం అన్యాయమన్నారు.

ST welfare Telangana | ఇందిరమ్మ ఇళ్లకు రూ.6లక్షలు ఇస్తామని చెప్పి..

ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma Houses) గిరిజనులకు రూ.6 లక్షలు ఇస్తామన్నారని, అందరితో పాటుగా రూ.5లక్షలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. అలాగే పదోతరగతి పాస్ అయిన విద్యార్థులకు రూ.10వేలు, ఇంటర్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20వేలు, నిరుద్యోగ యువకులకు రూ.5 లక్షల రుణాలు ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. తండాలను రెవెన్యూ గ్రామలుగా మారుస్తామన్నారని, ఒక్కో పంచాయతీకి అభివృద్ధి కోసం రూ.25 లక్షలు ఇస్తామన్నారని, ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ నిధులు ఎటు వెళ్తున్నాయని ప్రశ్నించారు. బడ్జెట్లో నిధులు చూపిస్తూ వాటిని గిరిజనుల కోసం ఖర్చు చేయకుండా ఇతర వాటికి ఎందుకు మళ్లిస్తున్నారని నిలదీశారు.

ST welfare Telangana | పోడు భూములు ఆన్​లైన్​లో కనిపించట్లేదు..

గతంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారని, వాటిపై రైతుబంధు కూడా వచ్చిందని, ప్రస్తుతం ఆ భూములు ఆన్​లైన్​లో కనిపించడం లేదన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈనెల 26న నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నామని, గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ జాదవ్, జిల్క్ ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, గౌరవ అధ్యక్షుడు రూప్ సింగ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవీందర్ నాయక్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *