బిజినెస్​Realme Phone Prices | పెరిగిన రియల్​ మీ ఫోన్ల ధరలు

Realme Phone Prices | పెరిగిన రియల్​ మీ ఫోన్ల ధరలు

కొత్తగా మొబైల్​ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి రియల్​ మీ సంస్థ షాక్​ ఇచ్చింది. రియల్ మీ 16 వేరియంట్ల ధరలను పెంచింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme Phone Prices | కొత్తగా మొబైల్​ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి రియల్​ మీ సంస్థ షాక్​ ఇచ్చింది. పలు రకాల మొబైల్స్​ ధరలను పెంచింది.

Realme Phone Prices | నేటి నుంచి అమలులోకి

రియల్​ మీ తన Realme 16 స్మార్ట్‌ఫోన్ (Realme 16 Smartphone) శ్రేణి మొత్తానికి సంబంధించిన విక్రయ ధరలను పెంచినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పెంపు నేటి నుంచి అమలులోకి వచ్చింది. దేశంలో Realme 16 సిరీస్ ధరలు రూ. 3,000 వరకు పెరిగాయి. Realme 16 5G, Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Realme Phone Prices | ధరల పెంపు ఇలా..

రియల్ మీ 16 5G మోడల్‌లో 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌పై రూ. 2,000, 8జీబీ + 256 జీబీ, 12 జీబీ + 256 జీబీ వేరియంట్లపై రూ. 3,000 చొప్పున ధర పెరిగింది. దీంతో వాటి ధరలు వరుసగా రూ. 33,999, రూ. 36,999, రూ. 39,999కి చేరాయి. రియల్​ మీ 16 ప్రో 5G మోడల్‌లో 8 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 256 జీబీ వేరియంట్లు రెండింటిపైనా రూ. 1,000 చొప్పున ధర పెరిగింది. దీంతో వాటి కొత్త ధరలు రూ. 39,999, రూ. 42,999కి చేరాయి. రియల్​ మీ 16 ప్రో + 5జి మోడల్‌లో 8 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్లపై రూ. 2,000 చొప్పున ధర పెరిగింది. 12 జీబీ + 256 జీబీ వేరియంట్‌పై రూ. 3,000 ధర పెరిగింది. దీంతో ఈ మోడల్ ధరలు వరుసగా రూ. 46,999, రూ. 48,999, రూ. 52,999కి చేరాయి. విడి భాగాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రియల్ మీ తెలిపింది. మరోవైపు వన్ ప్లస్ 15R ధర కూడా పెరిగింది.

ఇది కూడా చదవండి..: May 18 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. బలహీనంగా ప్రారంభం కానున్న సెన్సెక్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...

Youth Drowning | ప్రాణం తీసిన ఈత సరదా.. కుంటలో మునిగి యువకుడి మృత్యువాత

అక్షరటుడే, బాన్సువాడ: Youth Drowning | ఎండ వేడిని తట్టుకోలేక స్నేహితులతో...