Vi WhatsApp Business Solutions | వ్యాపార సంస్థలకు Vi బంపర్ ఆఫర్.. 15 నిమిషాల్లోనే వాట్సాప్ బిజినెస్ ఆన్‌బోర్డింగ్

వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో మరింత సులభంగా, వేగంగా సంభాషించేందుకు వీలుగా వోడాఫోన్ ఐడియా (Vi) ఎంటర్‌ప్రైజ్ విభాగమైన 'వీ బిజినెస్' (Vi Business) సరికొత్త 'వాట్సాప్ బిజినెస్ సొల్యూషన్స్'ను ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vi WhatsApp Business Solutions | వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో మరింత సులభంగా, వేగంగా సంభాషించేందుకు వీలుగా వోడాఫోన్ ఐడియా (Vi) ఎంటర్‌ప్రైజ్ విభాగమైన ‘Vi బిజినెస్’ (Vi Business) సరికొత్త ‘వాట్సాప్ బిజినెస్ సొల్యూషన్స్’ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వాట్సాప్ ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) నుంచి భారీ కార్పొరేట్ సంస్థల వరకు తమ కస్టమర్ సేవలను ఆటోమేట్ చేసుకుని, వ్యాపారాన్ని విస్తరించుకునేలా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

Vi WhatsApp Business Solutions | తక్షణ డిజిటల్ సేవలు

చిన్న , మధ్య తరహా వ్యాపార సంస్థలు (MSMEs) Vi వెబ్‌సైట్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో ప్లాన్ ఎంపిక, చెల్లింపు , యాక్టివేషన్ పూర్తి చేసి వాట్సాప్ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. దీని ద్వారా అలర్ట్‌లు, అప్‌డేట్‌లు, ప్రమోషన్ల కోసం బల్క్ బ్రాడ్‌కాస్ట్ మెసేజ్‌లు పంపే వీలుంటుంది. అంతేకాకుండా ఇంటరాక్టివ్ బటన్లు, ప్రొడక్ట్ క్యాటలాగ్‌లతో కూడిన రెడీమేడ్ టెంప్లేట్‌లతో పాటు మెసేజ్ డెలివరీ, కస్టమర్ స్పందనలను విశ్లేషించే సులభమైన అనలిటిక్స్ సాధనాలు ఇందులో ఉన్నాయి.

Vi WhatsApp Business Solutions | భారీ సంస్థలకు ఏఐ చాట్‌బాట్‌లు..

పెద్ద ఎంటర్‌ప్రైజ్ సంస్థల కోసం ఏఐ (AI) ఆధారిత ఆటోమేషన్, ఇంటెలిజెంట్ చాట్‌బాట్‌ల సదుపాయాన్ని కల్పించారు. వీటి ద్వారా భారీ సంఖ్యలో వచ్చే కస్టమర్ సందేహాలకు వేగంగా పరిష్కారాలు అందించవచ్చు. వీ బిజినెస్ వద్ద ఇప్పటికే ఉన్న సీపాస్ (CPaaS), సీసీఏఏఎస్ (CCaaS) సేవలైన ఎస్ఎంఎస్, వాయిస్, ఈమెయిల్, లైవ్ చాట్‌లతో పాటు వాట్సాప్ మెసేజింగ్ , వాయిస్ కాలింగ్‌ను అనుసంధానించి సమగ్ర కస్టమర్ సేవలను అందించే వెసులుబాటు ఉంది.

భవిష్యత్ కస్టమర్ సేవలు ఏఐ ఆధారితం: ఎం.పి. సునీల్ కుమార్
ఈ సందర్భంగా వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ చీఫ్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ ఎం.పి. సునీల్ కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో కస్టమర్ ఎంగేజ్‌మెంట్ పూర్తిగా సంభాషణాత్మకంగా, ఏఐ ఆధారితంగా మారుతోందన్నారు. వినియోగదారులు ఎక్కువగా వాడే వాట్సాప్ వేదికపై వ్యాపార సంస్థలు కేవలం ఉనికిని చాటుకోవడమే కాకుండా, వ్యక్తిగతీకరించిన, మెరుగైన అనుభవాన్ని అందించేలా తాము తోడ్పడుతున్నామని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు 15 నిమిషాల్లోనే సేవలు అందించడం నుంచి భారీ సంస్థల కస్టమర్ సేవలను ఆధునీకరించడం వరకు అన్ని దశల్లో వ్యాపారాలను మరింత స్మార్ట్‌గా, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  CM Revanth Reddy | సిద్దిపేట గడ్డ.. కాంగ్రెస్​ అడ్డా : సీఎం రేవంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *