Stock Market Crash | ట్రంప్ ఎఫెక్ట్ .. భారీ నష్టాల్లో ప్రధాన సూచీలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. దీంతో శాంతి ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది.

ఇదే సమయంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులను అమెరికా ఎత్తివేసే యోచనలో ఉండడంతో క్రూడ్ ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. భారత్ సహా 60 దేశాలపై యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 12.5 శాతం అదనపు సుంకాలను ప్రతిపాదించడంతో స్టాక్ మార్కెట్ (Stock Market) ఒత్తిడికి గురవుతోంది. ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్‌తో ప్రధాన సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Stock Market Crash | గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..

Stock Market Crash

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 142 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 811 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా మొదట్లో 31 పాయింట్లు ఎగబాకింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 235 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 960 పాయింట్ల లాభంతో 73,689 వద్ద, నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో 23,203 వద్ద ఉన్నాయి.

Stock Market Crash | ఐటీలో సెల్లాఫ్..

ఐటీ సెక్టార్ తీవ్ర సెల్లాఫ్‌కు గురవుతోంది. నిఫ్టీ ఐటీ సూచీ 4.55 శాతం క్షీణించగా.. రియాలిటీ 2.06 శాతం, మీడియా 1.47 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.21 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.08 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.07 శాతం, ఎఫ్ఎంసీజీ 1 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. టెలికాం ఇండెక్స్ మాత్రమే 0.95 శాతం లాభాలతో ఉంది.

Stock Market Crash

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 స్టాక్స్ లాభాలతో, 27 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి .063 శాతం, ట్రెంట్ 0.32 శాతం, ఎం అండ్ ఎం 0.19 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టీసీఎస్ 7.97 శాతం, టెక్ మహీంద్రా 4.68 శాతం, హెచ్సీఎల్ టెక్ 4.00 శాతం, ఇన్ఫోసిస్ 3.57 శాతం, ఐటీసీ 2.40 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: OYO IPO Approval | ఐపీవోకు ‘ఓయో’.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెబీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *