April 24 Market Analysis | మిక్స్ డ్ గా గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభంకానున్న దేశీయ మార్కెట్లు

Naresh Chandan
April 24 Market Analysis

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 24 Market Analysis | జియో పొలిటికల్(Geopolitical) టెన్షన్స్ తో ముడి చమురు ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ముగియగా.. శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో ఉండటంతో మన మార్కెట్ పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

April 24 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.89 శాతం, ఎస్ అండ్ పీ 0.41 శాతం నష్టపోయాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.20 శాతం నష్టంతో ఉంది.

April 24 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.86 శాతం లాభపడగా.. యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.19 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.16 శాతం నష్టపోయాయి.

April 24 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.77 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 0.40 శాతం లాభంతో కొనసాగుతుండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.73 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.66 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.52 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.36 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.36 శాతం లాభంతో సాగుతోంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,254 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 941 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.02 నుంచి 0.92 కు పడిపోయింది.
  • విక్స్ 1.58 శాతం పెరిగి 18.59 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోంది. బ్యారెల్‌కు 106.23 డాలర్లకు చేరింది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.82 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.33 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు బలహీనపడి 94.11 వద్ద ఉంది.

Panchkula Scam Probe | పంచకులా మున్సిపల్ కార్పొరేషన్​లో రూ.145 కోట్ల నిధుల దుర్వినియోగం.. విచారణ చేపట్టిన ఈడీ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *