బిజినెస్​April 24 Gold Rates | బంగారం, వెండి ధరలు తగ్గుముఖం.. కారణాలు ఇవే!

April 24 Gold Rates | బంగారం, వెండి ధరలు తగ్గుముఖం.. కారణాలు ఇవే!

దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. ఈ వారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,230 మేర తగ్గగా, వెండి ధర కూడా భారీగా క్షీణించింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పసిడి మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: April 24 Gold Rates | దేశంలో బంగారం, వెండి ధరలు Silver Prices క్ర‌మేపి త‌గ్గుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్ బలపడటం వంటి కారణాలతో పసిడి మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది.

ఫలితంగా గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఏప్రిల్ 24 ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,540ల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,740గా నమోదైంది. వెండి ధర కూడా తగ్గుతూ కిలోకు రూ.2,69,900ల వద్ద ఉంది.

April 24 Gold Rates | ఈ వారం భారీ తగ్గుదల

ఈ వారం ప్రారంభం నుంచే బంగారం ధరలు Gold Prices తిరోగమనంలో ఉన్నాయి. ఇప్పటివరకు 24 క్యారెట్ల పసిడి ధర దాదాపు రూ.2,230 మేర పడిపోయింది. ఒక్క ఏప్రిల్ 23నే మేలిమి బంగారం ధర రూ.1,200 మేర పడిపోవడం గమనార్హం. అదే విధంగా 22 క్యారెట్ల పసిడి ధరలో కూడా రూ.1,100 తగ్గుదల నమోదైంది. వెండి ధరలో కూడా కిలోకు రూ.5,000 వరకు కోత పడింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నై లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,470 కాగా, ఢిల్లీ లో రూ.1,53,690 , ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,53,540గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ.1,41,590గా ఉండగా, ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,40,740గా ఉంది. ఢిల్లీలో ఆభరణాల బంగారం ధర రూ.1,40,890గా నమోదైంది.

April 24 Gold Rates | అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం

వెండి ధరల్లో కూడా తగ్గుదల కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర గరిష్ఠంగా రూ.2,69,900గా ఉండగా, ముంబైలో అత్యల్పంగా రూ.2,59,900గా ఉంది. ఇతర నగరాల్లో కూడా వెండి ధరలు ఇదే తరహాలో తగ్గుముఖం పట్టాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా డాలర్ Dollar విలువ పెరగడం, ముడి చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు వ‌ల‌న పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి తగ్గించుకోవడం, ధరలు క్షీణించడానికి కారణమవుతున్నాయి.

ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా భావిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ఇంకా అస్థిరత కొనసాగుతుండటంతో ధరలు మరింత మారే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.

Panchkula Scam Probe | పంచకులా మున్సిపల్ కార్పొరేషన్​లో రూ.145 కోట్ల నిధుల దుర్వినియోగం.. విచారణ చేపట్టిన ఈడీ

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....