May 11 Gold Prices | మ‌ళ్లీ త‌గ్గుముఖం ప‌ట్టిన బంగారం ధ‌ర‌.. ప‌సిడి కొనొద్దని మోడీ చెప్ప‌డానికి కార‌ణాలు ఏంటి?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 11 Gold Prices | గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ America విలువలో మార్పులు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఒక దశలో తులం బంగారం ధర రూ.2 లక్షలకు చేరువ కావడంతో పాటు వెండి ధర కూడా రూ.4 లక్షల దాకా వెళ్లి సామాన్య ప్రజలకు భారంగా మారింది.

అయితే ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు కొంత స్థిరపడటం, పెట్టుబడిదారులు ఇతర మార్కెట్ల వైపు మొగ్గుచూపడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఆభరణాలు కొనాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది.

May 11 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్‌లో

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర Gold Rate ఔన్స్‌కు 4,715 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,234గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తూ ప్రస్తుతం కిలో ధర రూ.2,74,900 వద్ద ట్రేడవుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,234గా ఉండగా, నిన్నటి ధర రూ.1,52,650గా నమోదైంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,640గా ఉంది. వెండి కిలో ధర రూ.2,62,350గా కొనసాగుతోంది. విజయవాడ – విశాఖపట్నంల‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,234గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,640గా ఉంది.

ముంబైలో Mumbai 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,234 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో కూడా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,52,234గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,640 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,234గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,640గా నమోదైంది. చెన్నైలో మాత్రం బంగారం ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,360గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,490గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,490గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,790 వద్ద కొనసాగుతోంది.

May 11 Gold Prices | మోదీ వ్యాఖ్యల వెనుక అసలు కారణం?

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ Narendra Modi ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా “దేశ ప్రజలు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోలు తగ్గించాలి” అని అన్నారు.. ఈ వ్యాఖ్యల వెనుక ప్రధానంగా దేశ ఆర్థిక ప్రయోజనాలే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి. ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. దీంతో దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి విలువ పడిపోతున్న సమయంలో బంగారం దిగుమతులు పెరగడం వాణిజ్య లోటును మరింత పెంచే ప్రమాదం ఉంటుంది.

May 11 Gold Prices | దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

అంతేకాకుండా ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో యుద్ధ భయాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

May 11 Horoscope | పాత బకాయిల వసూలు.. మిత్రులుగా మారే శత్రువులు.. ఈ రాశుల వారికి కలిసొచ్చిన అదృష్టం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *