అక్షరటుడే వెబ్‌డెస్క్: Greenply TermiVax | భారతీయ ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Greenply Industries Limited) ప్లైవుడ్ పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చెదలు (Termites) పట్టకుండా నిరోధించేందుకు అధునాతన నానో టెక్నాలజీ ఆధారిత ‘టెర్మివ్యాక్స్’ (TermiVax) అనే వ్యాక్సినేటెడ్ సాంకేతికతను ఆవిష్కరించింది. ఈ సరికొత్త టెక్నాలజీ కోసం కంపెనీ ఇప్పటికే పేటెంట్ దరఖాస్తును కూడా దాఖలు చేసింది. సాధారణంగా వర్షాకాలం , తేమ వాతావరణంలో ఇళ్లలోని ఫర్నిచర్‌కు చెదలు పట్టే ప్రమాదం ఎక్కువ. గ్రీన్ ప్లై తీసుకొచ్చిన ఈ లైఫ్‌టైమ్ ప్రొటెక్షన్ టెక్నాలజీ వల్ల చెదలు పట్టే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
లోతైన రక్షణ:
ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న సాంకేతికతలు కేవలం ప్లైవుడ్ పైన (Surface treatment) మాత్రమే పనిచేసేవి. కానీ, ‘టెర్మివ్యాక్స్’ నానో టెక్నాలజీ కాంపౌండ్ ప్లైవుడ్ తయారీ సమయంలోనే లోపలి ప్రతి పొర , మూలమూలకూ వ్యాపిస్తుంది. కటింగ్, డ్రిల్లింగ్ లేదా తేమ తగలడం వల్ల సాధారణ పద్ధతుల్లో రక్షణ తగ్గిపోతుంది. అయితే గ్రీన్ ప్లై వ్యాక్సినేటెడ్ టెక్నాలజీ వల్ల ప్లైవుడ్‌కు ఎలాంటి హాని జరగకుండా సుదీర్ఘకాలం మన్నికగా ఉంటుంది. ఈ టెక్నాలజీని ‘ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ (IPIRTI) సమగ్రంగా పరిశీలించి, ఆమోదించింది.
Greenply TermiVax | మేనేజింగ్ డైరెక్టర్ ప్రకటన..
వినియోగదారులు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం చూపడమే గ్రీన్ ప్లై ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సానిధ్య మిత్తల్ తెలిపారు. ముఖ్యంగా భారతదేశంలోని వాతావరణ పరిస్థితుల వల్ల ఫర్నిచర్‌కు చెదలు పట్టడం పెద్ద సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ ‘టెర్మివ్యాక్స్’ ఆవిష్కరణ ద్వారా వినియోగదారుల ఇంటీరియర్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా మరింత భద్రమైన, ఆధునిక పరిష్కారాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు.
లభ్యత..
గ్రీన్ ప్లైకి చెందిన ప్రధాన ప్రీమియం శ్రేణి ఉత్పత్తులైన గ్రీన్ ప్లై మెరైన్ 710, గ్రీన్ ప్లై గోల్డ్, గ్రీన్ ప్లై ప్లాటినమ్, గ్రీన్ ప్లై క్లబ్ 500 , గ్రీన్ ప్లై క్లబ్ 700 లలో ఈ కొత్త ‘టెర్మివ్యాక్స్’ సాంకేతికత అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.