అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi Election Commission | కేంద్ర ప్రభుత్వం , కేంద్ర దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈడీ, సీబీఐ , ఫారెస్ట్రీ విభాగాలకు చెందిన దాదాపు 200 మంది కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం తమతో సంప్రదింపుల్లో ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Rahul Gandhi Election Commission | రాజ్యాంగ పరిరక్షణకే ..
ఈ పోరాటం కేవలం నరేంద్ర మోదీకి, తనకు మధ్య జరుగుతున్న వ్యక్తిగత సమరం కాదని రాహుల్ స్పష్టం చేశారు. దేశ యువత భవిష్యత్తును, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే ఈ యుద్ధమని వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసేంతవరకు తమ ఆందోళనలు ఆగేది లేదని, ఈ వ్యవహారంలో ఉన్న ఐదుగురు నేరగాళ్లు న్యాయవిచారణను ఎదుర్కొనే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Rahul Gandhi Election Commission | అప్రూవర్‌గా మారితే వదిలేస్తాం..
ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రధాన నిందితుడు కాకపోయినప్పటికీ, ఆయన తప్పు చేశారనడంలో ఎలాంటి సందేహం లేదని రాహుల్ పేర్కొన్నారు. ఆ తప్పు వెనుక ప్రధాని మోదీ ( Narendra Modi ) , హోంమంత్రి అమిత్ షాల హస్తం ఉందన్నారు. “ఈ ప్రెస్ మీట్‌ను జ్ఞానేశ్ కుమార్ చూస్తున్నారని నాకు తెలుసు. ఆయన రాజీనామా చేసి అప్రూవర్‌గా మారితే వదిలేస్తాం” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలిపై లక్షలాది మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ఆయన తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi Election Commission | ప్రజలను అడ్డుకుంటున్నారు..
ఢిల్లీని కేంద్ర ప్రభుత్వం ఒక సైనిక కోటలా మార్చేసిందని రాహుల్ మండిపడ్డారు. రాజధాని వీధుల్లో 20 వేల నుంచి 30 వేల మంది పోలీసులను మోహరించి, ప్రజలు ఢిల్లీకి చేరుకోకుండా రైళ్లు, బస్సులను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు యువతను అడ్డుకుంటూ మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులను మాత్రం స్వేచ్ఛగా తిరగనివ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ పక్షపాత వైఖరిపై హోంమంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీస్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ వంటి విభాగాలు , అధికారుల్లో సైతం అసంతృప్తి, చర్చలు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Dubai Bathukamma Celebrations | దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..