Tata Electronics Plant | టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ప్రమాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్​లో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tata Electronics Plant | తమిళనాడు (Tamil Nadu)లోని హోసూరులో గల టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో విషాదం నెలకొంది. మురికినీటి ట్యాంకును శుభ్రం చేసే క్రమంలో విష వాయువు పీల్చి ముగ్గురు కాంట్రాక్ట్​ కార్మికులు మృతి చెందారు.

టాటా ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ఫ్యాక్టరీలో కార్మికులు మురుగునీటి నిల్వ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హోసూర్ సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన విచారం వ్యక్తం చేశారు. ప్రతి కార్మికుడి భద్రత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ విషాద ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరిపి, దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tata Electronics Plant | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

కృష్ణగిరి జిల్లాలోని రాయకోట పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, శరత్ కుమార్ (25), అక్మల్ బాబు (28), కావేరి (31) అనే ముగ్గురు వ్యక్తులు విషపూరిత పొగలను పీల్చి ట్యాంకు లోపల కుప్పకూలిపోయారని తెలిపారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Sonia Gandhi PM Decision | అందుకే ప్రధాని పదవి తీసుకోలేదు : సోనియా గాంధీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *