Nepal Floods | నేపాల్ వరదల్లో 105 మంది భారతీయుల గల్లంతు

నేపాల్ వరదల్లో దాదాపు 400 మంది గల్లంతు అయ్యారు. అందులో 105 మంది భారతీయులు ఉన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Nepal Floods | నేపాల్ వరదల్లో దాదాపు 400 మంది గల్లంతు అయ్యారు. అందులో 105 మంది భారతీయులు ఉన్నారు. టిబెట్ (Tiber)​ సరిహద్దున ఉన్న నేపాల్​లో బుధవారం ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

వరదల్లో 46 మంది మరణించారు. 105 మంది భారతీయులు, 37 మంది ఎన్నారైలతో సహా దాదాపు 400 మంది గల్లంతయ్యారు. వరదలు ముంచెత్తడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు నీటిలో కొట్టుకుపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో, టిబెట్ వైపు నుండి భోటే కోషి నదిలో వరద ఉధృతంగా ప్రవహించిందని, దీనివల్ల టిబెట్ సరిహద్దులోని రసువా, ధాడింగ్ జిల్లాలతో పాటు కాఠ్మండుకు నైరుతి దిశలో ఉన్న నువాకోట్ జిల్లా ప్రభావితమైందని అధికారులు తెలిపారు.

Nepal Floods | 291 మంది విదేశీయులు

నేపాల్ పర్యాటక బోర్డు ప్రకారం వరదల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ జాతీయులతో సహా కనీసం 400 మంది గల్లంతైనట్లు సమాచారం. ఇందులో 105 మంది భారతీయ పర్యాటకులు, 37 మంది ఎన్నారైలు (ప్రవాస భారతీయులు) కాగా.. మిగిలిన వారు అమెరికా, మలేషియా, యూకే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాలకు చెందినవారు. గల్లంతైన భారతీయులలో 59 మంది కైలాస్​ మానసరోవర్ యాత్రకు వచ్చిన భక్తులని అధికారులు తెలిపారు.

Nepal Floods | భారీ నష్టం

ఆకస్మిక వరదలో నేపాల్​లో భారీ నష్టం చేకూరింది. రోడ్లు, వంతెనలు, నివాసాలు కొట్టుకుపోయాయి. అనేక మంది చనిపోయారు. నష్టం ఎంత జరిగిందో మాకు కచ్చితంగా తెలియదు, కానీ వరద చాలా పెద్దది, ఇది అనేక నివాస ప్రాంతాలను దెబ్బతీసి ఉండవచ్చు అని నేపాల్ పోలీస్ ప్రతినిధి తెలిపారు.

దీనిని కూడా చదవండి : Sugar Prices India | సామాన్యులకు ఊరట.. చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *