అక్షరటుడే, వెబ్డెస్క్: UGC NET Retest | లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజీసీ-నెట్ పునఃపరీక్ష వ్యవహారంపై సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
నేషనట్ టెస్టింగ్ ఏజెన్సీ చేసే తప్పులకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజీసీ నెట్ పరీక్షలు జూన్ 20 నుంచి 30 మధ్య జరిగాయి. సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టులకు పరీక్షలు జరిగాయి. తప్పులతో కూడిన ప్రశ్నపత్రాలను తయారు చేసి, పాత ప్రశ్నలనే పునరావృతం చేశామనే కారణంతో ఎన్టీఏ తాజాగా ఈ మూడు పరీక్షలనూ రద్దు చేసింది. సెప్టెంబర్లో మళ్లీ పరీక్షలు పెడుతామని ప్రకటించింది. దీనిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
UGC NET Retest | దోపిడీ యంత్రం..
ఏళ్లుగా పరీక్షల కోసం సిద్ధం అవుతున్న విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఫీజులు చెల్లించి, సుదూర కేంద్రాలకు ప్రయాణించి పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థులు, ఇప్పుడు సెప్టెంబర్లో ఇదంతా మళ్లీ చేయాలన్నారు. తప్పు చేసేది ఎన్టీఏ, కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను గతంలో కోటాలో, డెహ్రాడూన్లో, ప్రయాగ్రాజ్లో చెప్పానని తెలిపారు. ఇకపైనా చెబుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇది విద్యా వ్యవస్థ కాదని, దోపిడీ యంత్రమని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలోని ప్రతి ఇతర విభాగంలాగే, ఇది తమ తప్పేనని ఎన్టీఏ ఎప్పుడూ ఒప్పుకోదన్నారు. ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్చేశారు.
ఇది కూడా చదవండి..: Ashok Dham Stampede | ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి