Firecracker Factory Blast | బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు.. నలుగురు మృతి

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Firecracker Factory Blast | మధ్య ప్రదేశ్ (Madhya Pradesh)​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో నలుగురు కార్మికులు చనిపోయారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్‌లోని బాణాసంచా పరిశ్రమలో గురువారం పేలుడు చోటు చేసుకుంది. టోంక్ కలాన్ ప్రాంతంలోని యూనిట్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Firecracker Factory Blast | అక్రమంగా తయారీ

ఆ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నారని, గురువారం భారీ పేలుడు సంభవించిందని స్థానికులు పేర్కొన్నారు.ఫ్యాక్టరీలో ఏ ఉత్పత్తులను తయారు చేస్తున్నారనే దానిపై వారు వెంటనే స్పష్టత ఇవ్వలేదు. పేలుడు తీవ్రతకు కార్మికులు చాలా దూరం ఎగిరిపడ్డారు. సమీపంలోని ఇళ్లు కూడా కంపించాయి. ఆ ఫ్యాక్టరీలో మహిళలతో సహా 200 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఆ యూనిట్ అక్రమంగా నడుస్తోందని, పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

Firecracker Factory Blast | దర్యాప్తునకు ఆదేశాలు

ఈ ఘటనపై మధ్యప్రదేశ్​ సీఎం మోహన్​ యాదవ్ (CM Mohan Yadav) స్పందించారు. పేలుడుపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Red Fort Bomb Blast|ఎర్రకోట బాంబు పేలుడు కేసు.. 10 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ భారీ ఛార్జిషీట్

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *