అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mamata Banerjee Protest | బెంగాల్ (Bengal)లో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వత ఉత్కంఠభరితమైన రాజకీయ నాటకం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఈవీఎంలను తారుమారు చేయడానికి ప్రయత్నించాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా (Kolkata)లోని ఒక కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో పరిస్థితిని పరిశీలించడానికి దాదాపు నాలుగు గంటల పాటు గడిపారు.
బెంగాల్లో చివరి విడత ఎన్నికలు గురువారం ముగిసిన విషయం తెలిసిందే. అనంతరం బందోబస్తు ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ ఉన్న భవానిపూర్ (Bhavanipur)లోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌కు మమత బెనర్జీ అర్ధరాత్రి చేరుకున్నారు. ఆమె ఒక అభ్యర్థిగా ఆ ప్రాంగణంలోకి ప్రవేశించి తెల్లవారుజామున 12:07 గంటల వరకు లోపలే ఉన్నారు. కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి
Mamata Banerjee Protest | మమత మాట్లాడుతూ..
ఇక్కడ ఈవీఎంల కోసం ఒక స్ట్రాంగ్‌రూమ్ ఉందన్నారు. చాలా చోట్ల అవకతవకలు జరిగినట్లు తమకు తెలిసిందని చెప్పారు. అందుకే తాను సందర్శించడానికి వచ్చానని తెలిపారు. కానీ కేంద్ర బలగాలు తనను అడ్డుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, అభ్యర్థులను సీల్ చేసిన గది బయట వరకు మాత్రమే అనుమతిస్తారని, తనకు హక్కు ఉందని నేను వారికి చెప్పడంతో అనుమతించారన్నారు.
Mamata Banerjee Protest | స్పందించిన బీజేపీ
భబానీపూర్‌లో బెనర్జీపై పోటీ చేస్తున్న బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎలాంటి అనవసర ప్రయోజనాలు పొందవద్దని ఆమెకు కఠినంగా సూచించామన్నారు. ఆమె స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంలో ఉన్నంత సేపు, నా ఎన్నికల ఏజెంట్ వ్యక్తిగతంగా అక్కడే ఉండి, ఆమె ఎలాంటి అక్రమ మార్గాలకు పాల్పడకుండా కఠినమైన నిఘాలో ఉంచారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. తాను ఓడిపోతానని మమతకు తెలుసన్నారు. అందుకే అర్ధరాత్రి హంగామా చేశారని విమర్శించారు.
Mamata Banerjee Protest | టీఎంసీ నాయకుల ధర్నా
పలు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లు (EVM Strongrooms) ఉన్న ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రాంగణం లోపల బయటి వ్యక్తులు “బ్యాలెట్ పత్రాలతో తారుమారు చేస్తున్నట్లు” సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోందని నాయకులు కునాల్ ఘోష్, శశి పంజా ఆరోపించారు. తమకు తెలియకుండా స్ట్రాంగ్‌రూమ్‌ను ఎందుకు తిరిగి తెరిచారని టీఎంసీ నాయకులు కూడా ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. పోలింగ్ అనంతరం అభ్యర్థులు, పరిశీలకుల సమక్షంలో అన్ని ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లను సీల్ చేశామని, అవి సురక్షితంగానే ఉన్నాయని తెలిపింది.
ఇది కూడా చదవండి..: Goa Hockey Accident | గోవాలో విషాద ఘటన.. హాకీ బంతి తలకు తగిలి 13 ఏళ్ల బాలిక మృతి..

