Cauvery Water Dispute | కావేరీ నదీ జలాల వివాదం..అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కర్ణాటక ప్రభుత్వం

కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Cauvery Water Dispute | కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సీఎం నివాస కార్యాలయం ‘కృష్ణ’లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యమని నేతలు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం అందరం ఐక్యంగా నిలవాలని నిర్ణయించారు. తాగునీటి అవసరాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. అలాగే, కావేరి అథారిటీ (CWMA) సమావేశానికి ముందు కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలతో మాట్లాడి రాష్ట్ర వాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

Cauvery Water Dispute | హాజరైన ముఖ్య నేతలు..

ఈ అఖిలపక్ష సమావేశానికి మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, బి.ఎస్. యడియూరప్ప, హెచ్.డి. కుమారస్వామి, వీరప్ప మొయిలీ, సదానంద గౌడలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు మరియు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. న్యాయపరమైన, పరిపాలనాపరమైన చర్యలపై వీరంతా విస్తృతంగా చర్చించారు.

ఇది కూడా చదవండి: Dichpally Lorry Accident | జాతీయ రహదారిపై లారీ బోల్తా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *