అక్షరటుడే, డిచ్పల్లి: Dichpally Lorry Accident | జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన డిచ్పల్లి (Dichpally ) మండలం సుద్దపల్లి గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
Dichpally Lorry Accident | నాగ్‌పూర్ నుంచి స్పేర్‌పార్ట్స్
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ నుంచి స్పేర్‌పార్ట్స్ సామగ్రి లోడుతో బెంగళూరు (Benguluru) వైపు వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లారీ 44వ నంబర్ జాతీయ రహదారిపై సుద్దపల్లి( Suddapalli) గ్రామం వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న సర్వీస్ రెయిలింగ్‌పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కంటైనర్ లారీ సర్వీస్ రోడ్డును ఆనుకుని ఉన్న ఇనుప విద్యుత్ స్తంభంపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా ఉంది. అయితే లారీ స్తంభాన్ని ఢీకొట్టిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.