TNGOS Ganesh Celebrations | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో గణేష్​ నవరాత్రుల నిర్వహణ అభినందనీయం

టీఎన్జీవోస్​ నిజామాబాద్​ ఆధ్వర్యంలో గణేష్​ నవరాత్రుల నిర్వహణ అభినందనీయమని అడిషనల్​ కలెక్టర్​ భుజంగరావు అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: TNGOS Ganesh Celebrations | టీఎన్జీవోస్​ నిజామాబాద్​ (Nizamabad) ఆధ్వర్యంలో గణేష్​ నవరాత్రుల నిర్వహణ అభినందనీయమని అడిషనల్​ కలెక్టర్​ భుజంగరావు అన్నారు. ఎంప్లాయీస్​ జేఏసీ​, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ అధ్యక్షతన గణనాథుడి చెంత నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

TNGOS Ganesh Celebrations | మహా అన్నదానం..

నగరంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో మహా అన్నదానం ఏర్పాటు చేశారు. గణనాథుడికి భక్తితో పూజలు నిర్వహించిన అనంతరం మహిళా ఉద్యోగులు కుంకుమార్చన చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నదానం కార్యక్రమంలో డీఎంహెచ్​వో రాజశ్రీ, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, కేపీ సునీత, శివకుమార్, పద్మ గంగరాజు, గీతారెడ్డి, విజయలక్ష్మి, సునీల్, స్వామి, త్రివేణి, మంగారెడ్డి, జాకీర్ హుస్సేన్, మారుతి, జ్ఞానేశ్వర్ రెడ్డి శ్రీనివాస్, శశికాంత్ రెడ్డి, విశాల్, సుజన్ కుమార్, సాయికుమార్ గౌడ్, అధ్యక్ష కార్యదర్శులు సూర్య ప్రకాష్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Missing Person Death | నగరంలో అదృశ్యమైన వ్యక్తి బలవన్మరణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *