Grama sabha | గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Grama sabha | ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 4, 6, 8, 10వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం గ్రామ, వార్డు సభల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీపీ సాయి చైతన్య, అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్నారు. సభలను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలని సూచించారు.

Grama sabha | నిర్దేశిత తేదీల్లో సభలు నిర్వహించాలి

వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. గ్రామ, వార్డు సభలలో ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా కృషి చేయాలన్నారు. సభల నిర్వహణకు నిర్ణీత షెడ్యూల్ తయారు చేసి, తదనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలను నోడల్ అధికారులుగా నియమించాని పేర్కొన్నారు. నిర్దేశిత తేదీలలో ఆయా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Grama sabha

Grama sabha | ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై చర్చించాలి

నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్​గల్​ మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా సభలను ఏర్పాటు చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై చర్చించాలన్నారు. సభల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్​, వర్షపు నీరు నిల్వ చేయడం తదితర అంశాలపై అవగాహన కలిగించాలన్నారు. గ్రామ సభల్లోనూ రైతులకు ఆయిల్ ఫామ్, హార్టికల్చర్, ఫార్మర్ రిజిస్ట్రీ, నానో యూరియా, తదితర అంశాలపై పిపిటి ద్వారా తెలియజేయాలని సూచించారు. కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీఆర్​వో బి.గీత, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఏవో వీరస్వామి, సీపీవో రతన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu | గోదావరి పుష్కర పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *