TGPSC Notification | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఇంజినీరింగ్​ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGPSC Notification | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. 290 ఇంజినీరింగ్​ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ (TGPSC) మంగళవారం నోటిఫికేషన్​ జారీ చేసింది.

ప్రభుత్వం 3,800 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు లభించాయని చైర్మన్ బుర్రా వెంకటేశం (Burra Venkatesham) సోమవారం తెలిపిన విషయం తెలిసిందే. ప్రతి నెల సగటున మూడు నోటిఫికేషన్లను నిరంతరాయంగా విడుదల చేస్తామన్నారు. నేడు మూడు నోటిఫికేషన్లు రిలీజ్​ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఇంజినీరింగ్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.

job

TGPSC Notification | ఆన్​లైన్​లో దరఖాస్తులు

రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్​ (సివిల్​) పోస్టులను (AEE Posts) భర్తీ చేయనున్నారు. 18 నుంచి 44 ఏళ్లలోపు వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్​ 6 నుంచి జులై 13 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రోడ్లు భవనాల శాఖలో 49 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్​ (ఎలక్ట్రికల్​) పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్​ 8 నుంచి జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డులో 19 అసిస్టెంట్​ ఎన్విరాల్​మెంట్ ఇంజినీర్​ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్​ వెలువడింది. ఈ పోస్టుల కోసం జూన్​ 10 నుంచి జులై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం www.tgpsc.gov.in వెబ్​సైట్​ను సంప్రదించాలి.

students

దీనిని కూడా చదవండి : Mahesh Kumar Goud | పవన్ కళ్యాణ్‌పై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *