అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mandula Samuel Comments | తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు తన క్యాడర్ బాధపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మందుల సామేల్ శుక్రవారం రాజగోపాల్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తుంగతుర్తిలో ఆయనను గెలిపించి తప్పు చేశానన్నారు. సీటు కోసం తన ఇంటికి వంద సార్లు వచ్చాడన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా సామేలు స్పందించారు. రాజగోపాల్ పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చారన్నారు. ఆయన కంటే ముందు తాను వచ్చినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్‌లోకి వస్తే తాను గెలుస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారన్నారు.
Mandula Samuel Comments | మంత్రి ఒక్కమాట చెప్పలేదు
మునుగోడులో తన క్యాడర్ కూడా ఉందని మందుల సామేలు అన్నారు. మంత్రి కోమటిరెడ్డి తన నియోజకవర్గానికి వస్తే ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. తనకు టికెట్ ఇచ్చింది రాజగోపాల్ రెడ్డి కాదన్నారు. తనతో పాటు ఆయనకు కూడా ఏఐసీసీ టికెట్ ఇచ్చిందన్నారు. తనకు రెడ్లు ఓటేశారని, రాజగోపాల్ రెడ్డికి మాదిగలు ఓటేశారన్నారు.
Mandula Samuel Comments | ఎమ్మెల్యే కవ్వంపల్లి సైతం..
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క మందుల సామేల్‌కే కాదు.. మా దళిత ఎమ్మెల్యేలు అందరికీ ఇలానే జరుగుతుందన్నారు. తమ నియోజకవర్గాలు అణిచివేతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అన్నీ చెప్పామన్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Rajagopal Reddy Counter | మందుల సామేల్‌ను గెలిపించి తప్పు చేశా : రాజగోపాల్‌రెడ్డి