Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక “ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ సర్వే 2026” తాజాగా ప్రకటించిన దేశంలోని ‘బెస్ట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్’ (టాప్ 100 కలెక్టర్లు) జాబితాలో తెలంగాణకు చెందిన ముగ్గురు సమర్థులైన ఐఏఎస్ అధికారులు స్థానం సంపాదించుకున్నారు.తమదైన వినూత్న పాలన, ప్రజా సేవ, అద్భుత పరిపాలనా నైపుణ్యంతో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ముందంజలో నిలిపిన ఆ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana IAS Officers|టాప్ 100 లో నిలిచిన తెలంగాణ అధికారులు వీరే..

దాసరి హరిచందన, ఐఏఎస్ (హైదరాబాద్ పూర్వ కలెక్టర్), సి. నారాయణ రెడ్డి, ఐఏఎస్ (రంగారెడ్డి జిల్లా కలెక్టర్), మిక్కిలినేని మను చౌదరి, ఐఏఎస్ (మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్). దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 800 జిల్లాల కలెక్టర్ల పనితీరును పరిశీలించి, ప్రాథమిక సర్వే అనంతరం ఈ అత్యుత్తమ 100 మందితో కూడిన తుది జాబితాను ఖరారు చేశారు. ఇందులో మన రాష్ట్ర అధికారులు నిలవడం విశేషం.

Telangana IAS Officers|ఎంపికకు ప్రామాణికాలు (10 ముఖ్యమైన అంశాలు)..

‘ఫేమ్ ఇండియా మ్యాగజైన్’, ‘ఏషియా పోస్ట్’ సంయుక్తంగా నిర్వహించిన ఈ దేశవ్యాప్త సర్వేలో కలెక్టర్ల పనితీరును 10 ప్రధానాంశాల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించారు.ఇందులో ముఖ్యంగా అధికారుల నాయకత్వ లక్షణాలు (Leadership), పరిపాలనా సామర్థ్యంతో పాటు ప్రజలతో మమేకమవ్వడం (Public Outreach), ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపిన చొరవను ప్రాధాన్యతగా తీసుకున్నారు. వీటితో పాటే సదరు జిల్లాలో వారు చేపట్టిన వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వారి నిర్ణయాల వల్ల సమాజంపై పడిన సానుకూల ప్రభావాన్ని (Social Impact) కూడా ఈ అంచనాలో కీలక ప్రామాణికాలుగా పరిగణనలోకి తీసుకున్నారు.

Telangana IAS Officers|తెలంగాణకు గర్వకారణం..

ప్రజల అవసరాలే పరమావధిగా, పారదర్శకమైన పాలన అందిస్తూ ఈ ముగ్గురు అధికారులు అడ్మినిస్ట్రేషన్‌లో తమదైన ముద్ర వేశారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు తెలంగాణ రాష్ట్ర పరిపాలనా రంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కలెక్టర్లను గుర్తించి గౌరవించడమే లక్ష్యంగా 2011 నుంచి ఫేమ్ ఇండియా ఈ సర్వేలు నిర్వహిస్తోంది. కాగా, ఈ 100 మందిలో అత్యంత విశిష్టత కలిగిన టాప్ 25 మంది కలెక్టర్ల ప్రత్యేక జాబితాను రాబోయే సంచికలో ప్రత్యేకంగా ప్రచురించనున్నట్లు పేర్కొంది. జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించిన ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ప్రముఖులు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Madhya Pradesh Tour | మధ్యప్రదేశ్ మహా దర్శన్.. అద్భుతమైన టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చిన ఐఆర్‌సీటీసీ

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *