Madhya Pradesh Tour | మధ్యప్రదేశ్ మహా దర్శన్.. అద్భుతమైన టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చిన ఐఆర్‌సీటీసీ

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Tour | మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC)మరో టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘మధ్యప్రదేశ్ మహా దర్శన్’ పేరుతో విమాన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు, మహేశ్వర్, ఇండోర్ దర్శనీయ స్థలాలను కవర్ చేయనున్నారు. విమాన టికెట్లు, హోటల్ బస, భోజనం స్థానిక రవాణా సదుపాయాలు ఇందులో యాడ్‌ చేశారు. ఈ ప్యాకేజీ వివరాలిలా ఉన్నాయి.

Madhya Pradesh Tour | 4 రాత్రులు, 5 పగళ్లు..

మధ్యప్రదేశ్ మహా దర్శన్ పర్యటన మొత్తం 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగనుంది. ప్రధానంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం (భస్మ హారతి), ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, మహేశ్వర్‌ ప్రాంతంలోని నర్మదా నది ఘాట్‌లు, ఇండోర్‌ ప్రాంతంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు తీసుకువెళతారు.

Madhya Pradesh Tour | విమాన ప్రయాణం..

యాత్ర 2026 ఆగస్టు 26న హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు విమానం బయలుదేరి, అదేరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చేరుకుంటుంది. మధ్యప్రదేశ్‌లో యాత్ర పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణం కూడా విమానం ద్వారానే ఉంటుంది. ఆగస్టు 30 సాయంత్రం 6.45 గంటలకు ఇండోర్ నుంచి విమానం బయలుదేరి రాత్రి 8.10 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుంది.

Madhya Pradesh Tour | ఇవీ ప్యాకేజీలో భాగమే..

ప్యాకేజీలో భాగంగా పోనురాను విమాన టికెట్లు, యాత్రికులు బస చేయడానికి నాణ్యమైన ఏసీ హోటళ్ల సౌకర్యం కల్పిస్తారు. రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం సమకూరుస్తారు.
ఇండోర్‌లో దర్శనీయ స్థలాలను చూడడానికి ఏసీ బస్సులను అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులకోసం ఒక టూర్ ఎస్కార్ట్ ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రయాణ బీమా కూడా ఉంటుంది.

Madhya Pradesh Tour | ప్యాకేజీ వివరాలు..

ఒకే గదిలో ముగ్గురు వ్యక్తులు బస చేస్తే ఒక్కొక్కరికి రూ. 30,350 చార్జి చేస్తారు. ఇద్దరు వ్యక్తులే ఉంటే ఒక్కొక్కరికి రూ. 32,500. ఒక గదిలో ఒంటరిగా ఉండాలనుకుంటే రూ. 40,750 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ irctctourism.com ద్వారా ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. లేదా ఐఆర్‌సీటీసీ కార్యాలయాలనూ సంప్రదించవచ్చు.

ఇది కూడా చదవండి..: Economic Storm Warning | దేశంలో ఆర్థిక తుపాన్​ రాబోతుంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *