Economic Storm Warning | దేశంలో ఆర్థిక తుపాన్​ రాబోతుంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Economic Storm Warning | కాంగ్రెస్ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక తుఫాన్‌ రాబోతుందని హెచ్చరించారు. సామాన్యులు భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పదన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక నిర్ణయాలు వ్యవస్థలను కుప్పకూల్చడం ఖాయమన్నారు.

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఐదు దేశాల పర్యటనపై మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి ప్రపంచాన్ని బయటకు వెళ్లవద్దని చెబుతూ, తానూ ప్రపంచమంతా పర్యటిస్తున్నారని విమర్శించారు. ఆయన తన రాజభవనాల్లో కూర్చుంటారు, ఉత్తరప్రదేశ్ యువత, ప్రజలు పూర్తి షాక్‌కు గురవుతారు. రాబోయే ఆర్థిక షాక్ అదానీ, అంబానీలను గానీ, మోదీని గానీ ప్రభావితం చేయదు, కానీ అది సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తుందన్నారు.

Economic Storm Warning | ఇంధన ధరలపై ఆందోళన

కేంద్ర ప్రభుత్వం (Central Government) వారం వ్యవధిలో రెండు సార్లు పెట్రోల్​, డీజిల్​, సీఎన్​జీ ధరలను పెంచింది. ఇంధన ధరల పెంపుపై రాహుల్​ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. బడా మంగళ్ సందర్భంగా రాయ్‌బరేలీలోని చురువా హనుమాన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా చూడని ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ అన్నారు.

ఇది కూడా చదవండి..: Karnataka Border | కర్ణాటక చెత్త తెలంగాణలో డంప్​.. అడ్డుకున్న స్థానికులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *