Vijay TVK Lead | తమిళనాట దూసుకుపోతున్న దళపతి.. 68 స్థానాల్లో ఆధిక్యం

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay TVK Lead | తమిళనాడులో(Tamil Nadu Elections) దళపతి విజయ్​ పార్టీ దూసుకుపోతుంది. టీవీకే పార్టీ(Vijay TVK) 66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Vijay TVK Lead | మొత్తం 234 స్థానాలు..

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్​ సత్తా చాటుతున్నాడు. ఆయన పార్టీ అభ్యర్థులు 66 చోట్ల లీడ్​లో ఉండటం గమనార్హం. పెరంబూర్​లో విజయ్​ సైతం లీడ్​లో ఉన్నారు.

Vijay TVK Lead | హంగ్​ దిశగా..

డీఎంకే కూటమి 50, ఏఐడీఎంకే కూటమి 52 స్థానాల్లో (Tamil Politics) ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సుధీర్ఘ కాలంగా రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలను దాటి తొలిసారి పోటీ పోటీ చేస్తున్న టీవీకే ఎక్కువ స్థానాల్లో లీడ్​లో ఉండటం గమనార్హం. ఎర్లీ ట్రెండ్స్(Early Trends)​ ప్రకారం రాష్ట్రంలో హంగ్​ వచ్చే అవకాశం ఉంది. విజయ్​ పెరంబూర్​తో(Perambur) పాటు తిరుచ్చి ఈస్ట్​లో సైతం లీడ్​లో ఉన్నారు. దక్షిణ, పశ్చిమ తమిళనాడులో టీవీకే ఆధిక్యం కొనసాగుతోంది. ముఖ్యంగా తొలిసారి ఓటు వేసిన వారు విజయ్​ పార్టీవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Election results | ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల ఫలితాలు.. ఏ స్టేట్​లో ఎవరు ముందంజలో ఉన్నారంటే..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *