UPI MDR Charges | వ్యాపారులకు గుడ్​న్యూస్​.. దీపావళి తర్వాతే ఎండీఆర్​ ఛార్జీలు

యూపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్​ ఛార్జీల వసూలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: UPI MDR Charges | యూపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్​ ఛార్జీలపై కేంద్రం గుడ్​న్యూస్​ చెప్పింది. ఛార్జీల వసూలను వాయిదా వేసింది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలకు మించి వ్యాపారులకు జరిపే యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్​ ఛార్జీలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఛార్జీలు అక్టోబర్​ 15 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. అయితే దసరా, దీపావళి నేపథ్యంలో ఛార్జీలు అమలులోకి వస్తే తమ వ్యాపారంపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందారు. ఈ మేరకు కేంద్రాన్ని కలిసి విన్నవించారు. దీంతో దీపావళి తర్వాత ఎండీఆర్​ ఛార్జీలను వసూలు చేయాలని నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (NCPI) నిర్ణయించింది. కొత్త అమలు తేదీని తర్వాత తెలియజేస్తామని పేర్కొంది.

UPI MDR Charges | పండుగ ఉండటంతో..

పండుగ సమయంలో ప్రజలు ఎక్కువగా షాపింగ్​ చేస్తారు. వినియోగదారుల ఖర్చు సాధారణంగా పెరుగుతుంది. దీంతో చెల్లింపు సంస్థలకు, వినియోగదారులకు వారి సిస్టమ్‌లను అప్‌డేట్ చేసుకోవడానికి మరింత సమయం ఇవ్వడానికి, పండుగ సీజన్‌లో ఈ మార్పును ప్రవేశపెట్టడంపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ఈ అమలును ఆలస్యం చేశారు.

ఇది కూడా చదవండి : Singareni Workers Bonus | సింగరేణి కార్మికులకు గుడ్​న్యూస్​.. రూ.1.53 లక్షల బోనస్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *