అక్షరటుడే, వెబ్డెస్క్ : Dimaagi Naxals | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రతిపక్ష నాయకులను మావోయిస్టు మనస్తత్వం ఉన్నవారని అనలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సాయుధ నక్సల్స్ను నిర్మూలించినా.. దిమాగీ నక్సల్స్ (Dimaagi Naxals) ముప్పు పొంచి ఉందన్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేశాయి. అణచివేయడానికే ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తాను కూడా దిమాగీ నక్సల్ అని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం పోస్టు చేశారు. విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ ఇచ్చారు. దిమాగీ నక్సల్స్ అనే పదాలు కేవలం మావోయిస్టులకు మద్దతు ఇచ్చి రాజ్యాంగాన్ని తిరస్కరించిన వారిని, వేర్పాటువాదులతో నిలబడి ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చిన వారిని మాత్రమే సూచిస్తాయని తెలిపారు. ఈశాన్య ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి వేరు చేయడానికి ‘చికెన్స్ నెక్’ను కత్తిరించాలని పిలుపునిచ్చే వారిని కూడా ఈ పదాలు సూచిస్తాయని అన్నారు.
Dimaagi Naxals | వారిని గుర్తించాలి
ప్రధాని మోదీ తన ప్రసంగంలో మావోయిస్టులను విజయవంతంగా నిర్మూలించినందుకు దేశాన్ని అభినందించారు. అడవుల్లో ఆయుధాలు చేపట్టిన మావోయిస్టులను నిర్మూలించినప్పటికీ, దేశం ముందుకు సాగాలంటే ‘దిమాగీ నక్సల్స్’ కూడా ఉన్నారని, వారిని ‘గుర్తించి, ఏకాకిని చేయాలి’ అని అన్నారు. మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ప్రజా జీవితంలో, ప్రభుత్వ కమిటీలలో కూడా ఉన్నారన్నారు. ఈ భావజాలం వివిధ సంస్థలను, కార్యక్రమాలను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. దేశాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
PM @narendramodi ji didn’t say opposition leaders as Dimagi Naxals. Only following are Dimagi Naxals:
1. Who support Maoists and reject Indian Constitution.
2. Who stand with separatists & support Article 370.
4. Who want to cut chicken neck to separate North-East from India.— Kiren Rijiju (@KirenRijiju) August 16, 2026
దీనిని కూడా చదవండి : TG SAFE | ‘తెలంగాణ సేఫ్’ కమిషనర్గా అవినాష్ మొహంతి