అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం కంధర్పల్లి గ్రామంలో ఆదివారం సందడి నెలకొంది. జుక్కల్(Jukkal) ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు(MLA Laxmikanth Rao) కుమార్తె జొనిట-దాస్ వివాహ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
CM Revanth Reddy | మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి..
మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా గ్రామ శివారులోని హెలిప్యాడ్ వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి 12:45 గంటలకు వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణానికి రాగా.. ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు కుటుంబ సమేతంగా ఘనంగా స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి వధూవరులు జొనిట, దాస్‌లను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.
CM Revanth Reddy | 20 నిమిషాల వరకు..
సుమారు 20 నిమిషాల పాటు వేడుకలో పాల్గొని, ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామం అంతా భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Ashish Banerjee Suicide | రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశా.. సూసైడ్ నోట్లో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే