అక్షరటుడే, వెబ్డెస్క్: Rental Vehicle Owners | తమ బకాయిలు చెల్లించాలని సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద అద్దె వాహనాల యజమానులు బుధవారం నిరసన తెలిపారు. రూ.170 కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యజమానులు నేటి నుంచి సమ్మెకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) 18 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా అద్దె వాహనాలు నిలిచిపోయాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతినెలా ఇవ్వాల్సిన అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అద్దె బిల్లులు ఐదో తేదీ నుండి పదో తేదీలోపు చెల్లించాలని కోరారు.
Rental Vehicle Owners | ఇబ్బందులు పడుతున్నాం

బిల్లులు చెల్లించకపోవడంతో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు, వాహనాల ఇన్సూరెన్స్, EMIలు చెల్లించలేక సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎంఐలు చెల్లించలేక తమ వాహనాలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Prashanth Reddy Detention | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం: హరీష్ రావు