MPTC ZPTC Elections | ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మరింత ఆలస్యం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MPTC ZPTC Elections | రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవి కాలం 2024 జూన్​లో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. గతేడాది 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్​ విడుదల చేసింది. అయితే ఆ జీవోను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికలు ఆగిపోయాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా మండల, జిల్లా పరిషత్​లకు పాలకవర్గాలు కరువయ్యాయి. ఈ క్రమంలో మే నెలలో ఎన్నికలు నిర్వహిస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

MPTC ZPTC Elections | ఆశావహుల నిరీక్షణ

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. త్వరలో ఎన్నికలనే ప్రచారం జరగడంతో ఇటీవల పలువురు తమకు టికెట్​ ఇవ్వాలని ఆయా పార్టీల నేతలను సైతం కలిశారు. అయితే తాజాగా ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మరోవైపు త్వరలో జనగణన (Census) నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. అధికారులు జన గణన విధుల్లో నిమగ్నం కానున్నారు. దీంతో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది.

MPTC ZPTC Elections | ఆగస్టులో ఎన్నికలు

ప్రస్తుతం ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కొనసాగునుంది. మే, జూన్​ నెలల్లో జన గణన నిర్వహిస్తారు. అలాగే జూన్​ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. దీంతో ఉపాధ్యాయులు అడ్మిషన్లు, ఇతర పనులతో బిజీగా ఉంటారు. దీంతో మే, జూన్​ నెలల్లో ఎన్నికలు సాధ్యం కాదు. జూలైలో వానాకాలం సాగు పనులు జోరుగా సాగుతాయి. దీంతో జులై చివరిలో లేదా ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి..: Telangana Fuel Shortage | తెలంగాణలో పెట్రోలు కష్టాలు.. పెరిగిన డిమాండ్​తో బంకు​ల్లో నో స్టాక్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *