అక్షరటుడే, విశాఖపట్నం: High Speed Diamond | బుల్లెట్ రైళ్ల రాకతో దక్షిణాది రాష్ట్రాల రవాణా ముఖచిత్రం పూర్తిగా మారిపోబోతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw)వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
High Speed Diamond | హైస్పీడ్ డైమండ్ కనెక్టివిటీ:
దక్షిణాదిలోని ప్రధాన నగరాలైన అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య అద్భుతమైన కనెక్టివిటీ పెరగబోతోందని మంత్రి తెలిపారు. ఈ నగరాలను అనుసంధానిస్తూ ‘హైస్పీడ్ డైమండ్’ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేయవచ్చని పేర్కొన్నారు.
High Speed Diamond | నిబద్ధతకు నిదర్శనం:
“హైస్పీడ్ డైమండ్ ప్రాజెక్టు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి (Central Government) ఉన్న నిబద్ధతకు నిదర్శనం” అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు.
గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖలో అడుగుపెడుతున్న తరుణంలో, ఇటువంటి హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు ఐటీ, పారిశ్రామిక రంగాల విస్తరణకు మరింత ఊతాన్నిస్తాయని మంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Nara Lokesh | ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క: మంత్రి లోకేశ్


[…] […]