అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Selloff | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలొస్తున్నాయి. దీనికితోడు ఆదివారం హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) చేసిన ప్రసంగం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
ప్రధాని ఇచ్చిన పొదుపు పిలుపుతో కోవిడ్ నాటి పరిస్థితులు తిరిగి తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు భారీగా పతనమవుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మÖడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి.
Stock Market Selloff | తీవ్ర అమ్మకాల ఒత్తిడి..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 690 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 40 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో మరో 721 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 206 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 198 పాయింట్లు పతనమైంది. ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్ కోలుకుంటున్నట్లు కనిపించినా.. చివరి గంటన్నరలో తిరిగి సెల్లాఫ్ నకు గురయ్యింది. చివరికి సెన్సెక్స్ 1,312 పాయింట్ల నష్టంతో 76,015 వద్ద, నిఫ్టీ 360 పాయింట్ల నష్టంతో 23,815 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Selloff | ఫార్మా, ఎఫ్ఎంసీజీ మినహా..
ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల ఇండెక్స్‌లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ (Nifty) ఫార్మా ఇండెక్స్ 0.25 శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.88 శాతం పెరిగాయి. నిఫ్టీలో కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 3.76 శాతం, రియాలిటీ 3.05 శాతం, మీడియా 2.49 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.24 శాతం, పవర్ 2.13 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.09 శాతం, ఆటో 1.86 శాతం, ఎనర్జీ 1.85 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.57 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.49 శాతం నష్టాలతో ముగిశాయి.
Stock Market Selloff | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,457 కంపెనీలు లాభపడగా 2,892 స్టాక్స్ నష్టపోయాయి. 189 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 198 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 24 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో, 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. సన్‌ఫార్మా 1.36 శాతం, హెచ్యూఎల్ 0.85 శాతం, అదానీపోర్ట్స్ 043 శాతం, కొటక్ బ్యాంక్ 0.14 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.13 శాతం లాభపడ్డాయి.
Top Losers : టైటాన్ 6.83 శాతం, ఇండిగో 4.69 శాతం, ఎస్ బీఐ 4.52 శాతం, ఎయిర్‌టెల్ 4.18 శాతం, ఎటర్నల్ 4.08 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Crash | ఆర్థిక సంక్షోభ భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు..

