బిజినెస్​Maruti Car Offers | మారుతి కార్లపై భారీ ఆఫర్లు..

Maruti Car Offers | మారుతి కార్లపై భారీ ఆఫర్లు..

దేశంలో అగ్రగామి కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ భారీ ఆఫర్లను ప్రకటించింది. పలు మాడళ్లపై భారీ రాయితీలు ఇస్తున్నట్టు తెలిపింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maruti Car Offers | కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకీ (Maruti Suzuki) మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చింది. అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను అన్ని రకాల మాడళ్లపై రాయితీలు ఇస్తున్నట్టు తెలిపింది.

ఇందులో కన్జూమర్ ఆఫర్, స్పెషల్ డీలర్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్, అప్‌గ్రేడ్ లాయల్టీ బోనస్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ వంటివి కలిసి ఉంటాయి. ఆఫర్ మే చివరి వరకు మాత్రమే వర్తించనుంది. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ వర్తించనుందో తెలుసుకుందామా..

Maruti Car Offers | మారుతి ఎస్ -ప్రెస్సో

ఎస్ -ప్రెస్సో అన్ని వేరియంట్లపై రూ. 37,500 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లలో రూ. 10 వేల కన్జూమర్ తగ్గింపు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ రూ. 25 వేల వరకు, కంపెనీ తగ్గింపు రూ. 2,500 ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 3.50 లక్షలు.

Maruti Car Offers | మారుతి ఆల్టో కే10

ఆల్టో కే10 ఎల్ ఎక్స్ ఐ పెట్రోల్ వేరియంట్‌పై బెనిఫిట్స్ రూ. 52,500 వరకు ఉండగా, ఇతర ట్రిమ్‌లపై రూ. 42,500 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. వీటిలో రూ. 25 వేల వరకు కన్జూమర్ ఆఫర్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 2,500 కంపెనీ తగ్గింపు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 3.70 లక్షలు.

Maruti Car Offers | మారుతి సెలెరియో

సెలెరియో అన్ని వేరియంట్లపై రూ. 37,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో రూ. 10 వేల కన్జూమర్ ఆఫర్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 2,500 కంపెనీ డిస్కౌంట్ ఉన్నాయి. సెలెరియో ప్రారంభ ధర రూ . 4.70 లక్షలు.

Maruti Car Offers | మారుతి వాగన్ ఆర్

పెట్రోల్ , సీఎన్జీ వేరియంట్లు రెండింటిలోనూ మొత్తం రూ. 52,500 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో రూ. 25 వేల కన్జూమర్ ఆఫర్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 2,500 కంపెనీ డిస్కౌంట్ ఉన్నాయి. దీని ఎక్స్ షోరూం ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతంది.

మారుతి ఈకో సీఎన్జీ : మారుతి ఈకో పెట్రోల్ , సీఎన్జీఈ వేరియంట్లు రెండూ రూ. 37,500 వరకు ప్రయోజనాలతో వస్తుంది. వీటిలో రూ. 10 వేల కన్జూమర్ ఆఫర్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 2,500 కంపెనీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈకో ప్రారంభ ధర రూ. 5.21 లక్షలు.

మారుతి స్విఫ్ట్ : మారుతి స్విఫ్ట్ కారు ఏఎంటీ వేరియంట్లపై రూ. 45 వేల వరకు, మాన్యువల్ , సీఎన్జీ ట్రిమ్‌లపై రూ. 40 వేల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లలో ఏఎంటీ వేరియంట్లపై రూ. 15 వేలు, ఇతర వేరియంట్లపై రూ. 10 వేల కన్జూమర్ డిస్కౌంట్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 5 వేల కంపెనీ డిస్కౌంట్స్ ఉన్నాయి. దీని ఎక్స్ షోరూం ధర రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షల మధ్య ఉంటుంది.

మారుతి బ్రెజ్జా : బ్రెజ్జా పెట్రోల్ , సీఎన్జీ వేరియంట్లపై రూ. 55 వేల వరకు ప్రయోజనాలున్నాయి. వీటిలో రూ. 25 వేల కన్జూమర్ ఆఫర్, రూ. 25వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 5 వేల సంస్థాగత డిస్కౌంట్స్ ఉన్నాయి. దీని ఎక్స్ షోరూం ధర రూ. 8.26 లక్షల నుంచి రూ. 12.86 లక్షల మధ్యలో ఉంది.

మారుతి విక్టోరిస్ : విక్టోరిస్ సీఎన్జీ వేరియంట్లపై రూ. 70 వేల వరకు బెనిఫిట్స్ ఉండగా, పెట్రోల్ ఇంకా హైబ్రిడ్ వేరియంట్లపై రూ. 50 వేల వరకు ఆఫర్లు వర్తించనున్నాయి. వీటిలో సీఎన్జీ ట్రిమ్‌లపై రూ. 60 వేల వరకు, పెట్రోల్, హైబ్రిడ్ వేరియంట్లపై రూ. 40 వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లతో పాటు, రూ. 10 వేల డిస్కౌంట్ కూడా ఉన్నాయి. దీని ఎక్స్ షోరూం ధర రూ . 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల మధ్య ఉంటుంది.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | నష్టాల్లో మార్కెట్లు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...