Telangana Law Order| హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్.. అందుకే రాష్ట్రంలో ఈ దారుణాలు: కేటీఆర్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana Law Order| తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఘోర నేరాలు రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం శాఖను తన వద్దే ఉంచుకున్నప్పటికీ, ప్రజల భద్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

Telangana Law Order|హై సెక్యూరిటీ జోన్‌లోనే హత్యలా?

శాంతిభద్రతల క్షీణతపై బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం డీజీపీని కలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనే.. రిటైర్డ్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య హత్యకు గురవ్వడం దిగ్భ్రాంతి కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు. హై సెక్యూరిటీ ఉండే ప్రశాసన్ నగర్ ఏరియాలోనే ఇలాంటి ఘటన జరగడం భద్రతా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. నిన్న రాత్రి సికింద్రాబాద్ నడిరోడ్డుపై యువకుడిని అత్యంత కిరాతకంగా పొడిచి చంపిన ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు.

Telangana Law Order|పోలీస్ వ్యవస్థను వేధింపులకే వాడుతున్నారు..

రాష్ట్ర పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం దారి మళ్లించిందని కేటీఆర్ ఆరోపించారు. “బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టడానికి, వారిని వేధించడానికి మాత్రమే పోలీసులను వాడుతున్నారు. పోలీసుల దృష్టి నేరాల నియంత్రణపై కాకుండా రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడంపై ఉండటం వల్లే శాంతిభద్రతలు అదుపు తప్పడం అనివార్యమైంది” అని ఆయన పేర్కొన్నారు.

Telangana Law Order|క్రైమ్ రేటుపై ఆందోళన..

తెలంగాణలో మహిళలపై దాడులు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని తాజా ఎన్‌సీఆర్‌బీ (NCRB) నివేదిక కూడా స్పష్టం చేస్తోందని కేటీఆర్ గుర్తు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలని, లేదంటే ప్రజల భద్రత గాలికే వదిలేసినట్లవుతుందని హెచ్చరించారు.


ఇది కూడా చదవండి: Harish Rao | రైతులతో కాళ్లు మొక్కిస్తున్న ప్రభుత్వం : హరీశ్​రావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *