Urban MLA Dhanpal | వాల్ పెయింటింగ్ వేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Urban MLA Dhanpal | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో ఈనెల 10న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని మిర్చి కాంపౌండ్ రోడ్​లో శుక్రవారం వాల్ పెయింటింగ్ వేశారు.

Urban MLA Dhanpal | రూ. 8 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana)లో సుమారు రూ.8 వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. 10న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు ఇందూరు జిల్లా, నగర వాసులు భారీగా తరలిరావాలన్నారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మోదీకి ఘనంగా ఆహ్వానం పలకాలన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్​లో విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ (BJP)కి మరింత ఆదరణ పెరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, దాంపల్లి మురళి, బంటు ప్రవీణ్, కైరంకొండ మురళి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Division Problems | సమస్యల పరిష్కారానికి కృషి : మున్సిపల్​ కమిషనర్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *