Nizamabad Division Problems | సమస్యల పరిష్కారానికి కృషి : మున్సిపల్​ కమిషనర్

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Division Problems | నగరంలోని 27వ డివిజన్​లో సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (Municipal Corporation Commissioner) దిలీప్ కుమార్ తెలిపారు. డివిజన్​ పరిధిలో కార్పొరేటర్ కల్పె అర్చన చిరంజీవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజుతో కలిసి పర్యటించారు.

Nizamabad Division Problems | దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి..

ఈ సందర్భంగా డివిజన్​లోని పలు కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రెయినేజీ, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపుతామని కార్పొరేషన్​ కమిషనర్​ హామీ ఇచ్చారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణ పరిష్కారం కోసం కార్పొరేషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత కార్పొరేటర్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎండాకాలంలో తాగునీటి సమస్య (Drinking Water Problem) రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో 27వ డివిజన్​ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

chiru 1

ఇది కూడా చదవండి..: Digital Census Telangana | రాష్ట్రంలో డిజిటల్​ విధానంలో జనగణన..: ఆర్డీవో ప్రభాకర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *