అక్షరటుడే, ఇందూరు: Congress Division Presidents | త్వరలోనే నగరంలో కొత్తగా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను చేపడతామని డీసీసీ(Congress Party) కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్(Nizamabad urban), రూరల్, ఆర్మూర్(Armoor) డివిజన్, వార్డుల అధ్యక్షుల రద్దుపై ఆయన శనివారం స్పందించారు.
Congress Division Presidents | ఆరోపణల నేపథ్యంలో..
పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Bomma) ఆదేశాల మేరకు మే 30వ తేదీన నగరంలోని 60 డివిజన్లకు, ఆర్మూర్ వార్డులకు సంబంధించిన అధ్యక్షుల నియామకాన్ని చేపట్టామన్నారు. అయితే కొన్ని డివిజన్లలో అధ్యక్షుల నియామకాలపై ఆరోపణలు వచ్చాయని దీనిపై పీసీసీ కమిటీ విచారణ చేసిందన్నారు. అనంతరం అధిష్టానం ఆదేశాల మేరకు డివిజన్, వార్డుల అధ్యక్షుల నియామకాన్ని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. త్వరలోనే కొత్త డివిజన్, వార్డుల అధ్యక్షులు నియామకాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన నియామకాలపై అభ్యంతరాలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
