India vs Afghanistan ODI | అఫ్గానిస్థాన్​పై భారత్ ఘన విజయం

అఫ్గానిస్థాన్​పై మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs Afghanistan ODI | అఫ్గానిస్థాన్​పై మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేసింది.

చెన్నై శనివారం మూడో వన్డే జరిగింది. తొలుత బ్యాటింగ్​ చేసిన అఫ్గాన్​ జట్టు 44.2 ఓవర్లకు 218 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును కెప్టెన్​ హస్మతుల్ల షాహిదీ ఆదుకున్నాడు. 131 బంతుల్లో 102 పరుగులతో రాణించాడు. అజ్మతుల్ల 50 పరుగులతో అతడికి సహకారం అందించాడు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. దీంతో అఫ్గానిస్థాన్​ 218 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్​ ప్రసిద్​ కృష్ణ 5 వికెట్లు తీశాడు.

kl rahul 1

India vs Afghanistan ODI | దంచికొట్టిన జైస్వాల్​

భారత జట్టు 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ దంచికొట్టారు. జైస్వాల్ 86 బంతుల్లో 110 పరుగులు (నాటౌట్) చేసి రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రోహిత్​ శర్మ సైతం బ్యాట్ ఝుళిపించాడు. 69 బంతుల్లో 79 పరుగులు చేశాడు. శ్రేయాస్​ అయ్యార్ 20 పరుగులు చేశాడు. దీంతో భారత్​ ఒక వికెట్​ మాత్రమే కోల్పోయి 28.4 ఓవర్లలో విజయం సాధించింది. శుభ్​మన్​ గిల్​ కెప్టెన్సీలో భారత్​ తొలి సిరీస్​ను గెలుపొందింది.

 

 

దీనిని కూడా చదవండి : Maharashtra Temple Collapse | మహారాష్ట్రలో విషాదం.. మండపం కూలి ఆరుగురు మృతి!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *