Abhishek Sharma Century | ఆఫ్గానిస్థాన్​పై అభిషేక్​ విధ్వంసం.. 30 బంతుల్లో సెంచరీ

ఆఫ్గానిస్థాన్​తో జరుగుతున్న మూడో టీ 20లో అభిషేక్​ శర్మ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Abhishek Sharma Century | ఆఫ్గానిస్థాన్​తో జరుగుతున్న మూడో టీ 20లో భారత్​ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్​ అభిషేక్​ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశారు.

మూడు టీ 20ల సిరీస్​లో ఇప్పటికే భారత్​ రెండు మ్యాచ్​లో ఘన విజయం సాధించింది. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న మూడో టీ 20లో టాస్​ గెలిచిన ఆఫ్గాన్​ జట్టు బౌలింగ్​ ఎంచుకుంది. ఆది నుంచే భారత బ్యాటర్లు ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు.

Abhishek Sharma Century | ఫాస్టెస్ట్​ సెంచరీ

ఓపెనర్​ అభిషేక్​ శర్మ ఆఫ్గన్​ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో ఫీల్డర్లు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. 30 బంతుల్లోనే 100 పరుగుల పూర్తి చేసుకున్నాడు. మొత్తం 34 పరుగుల్లో 108 రన్స్​ చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 11 సిక్స్​లు ఉన్నాయి. అనంతరం రషీద్ ఖాన్​ బౌలింగ్​లో అవుట్​ అయ్యాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ టీమ్స్​లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. అభిషేక్​కు ఇది మూడో టీ 20 శతకం. భారత్​ నుంచి గతంలో రోహిత్​ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేయగా.. తాజాగా అభిషేక్​ దానిని బ్రేక్​ చేశాడు. సంజు శాంసన్​ సైతం వేగంగా ఆడటంతో భారత్​ భారీ స్కోర్​ దిశగా సాగుతోంది. 12.2 ఓవర్లకు భారత్​ రెండు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్​ శ్రేయస్​ అయ్యర్​ ఉన్నారు.

 

దీనిని కూడా చదవండి : Police Exam Dates | పోలీస్​ ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.