అక్షరటుడే వెబ్డెస్క్: WRO India National Championship 2026 | భవిష్యత్ తరంలో సృజనాత్మకత, కోడింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘డబ్ల్యూఆర్ఓ ఇండియా నేషనల్ ఛాంపియన్షిప్ 2026’ హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోసిటీ జీఎంఆర్ అరీనాలో విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 300కు పైగా యువ ఆవిష్కర్తల బృందాలు తమ రోబోటిక్స్, ఇంజనీరింగ్ ప్రతిభను ప్రదర్శించాయి.
WRO India National Championship 2026 | వేదికకు ఎంపికైన విజేతలు..
వివిధ ప్రాంతీయ రౌండ్లలో ప్రతిభ చాటుకుని జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన యువ బృందాలు, త్వరలో అమెరికాలోని ప్యూర్టో రికోలో జరిగే ‘గ్లోబల్ డబ్ల్యూఆర్ఓ ఛాంపియన్షిప్ 2026’లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఫ్యూచర్ ఇన్నోవేటర్స్, రోబోమిషన్, రోబోస్పోర్ట్స్, ఫ్యూచర్ ఇంజనీర్స్ విభాగాలలో వివిధ జట్లు విజయం సాధించాయి.
WRO India National Championship 2026 | స్టెమ్ విద్య ప్రాధాన్యత..
కేవలం సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా, విద్యార్థులలో గణనపరంగా ఆలోచించే విధానం, ప్రయోగాలు చేసే తత్వాన్ని పెంపొందించడానికి ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయని ఇండియా స్టెమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుధాన్షు శర్మ, ఎన్సీఎస్ఎం డైరెక్టర్ జనరల్ కె.ఎస్. మురళి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఇండియా స్టెమ్ ఫౌండేషన్ (ISF), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) సంయుక్తంగా ఈ ఛాంపియన్షిప్ను నిర్వహించగా, జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్ ( Hyderabad )వేదిక భాగస్వామిగా వ్యవహరించింది.
ఇది కూడా చదవండి: Moosarambagh Bridge | విశ్వనగరంగా హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి