Gaini Gangaram Retirement | ఉద్యోగుల సంక్షేమానికి గైని గంగారాం చేసిన సేవలు మరువలేనివి

ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉద్యోగుల సంక్షేమానికి గైని గంగారాం చేసిన సేవలు మరువలేనివని వక్తలు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Gaini Gangaram Retirement |ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉద్యోగుల సంక్షేమానికి గైని గంగారాం చేసిన సేవలు మరువలేనివని వక్తలు పేర్కొన్నారు. నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తూ సూపరింటెండెంట్​గా రిటైర్​ అవుతున్న గైని గంగారాం పదవీవిరమణ కార్యక్రమాన్ని నగరంలోని (Nizamabad) టీఎన్జీవోస్​ (TNGOs) జిల్లాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Gaini Gangaram Retirement | ఏళ్లుగా ఉద్యోగులకు సేవలు..

ఎంప్లాయీస్​ జేఏసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​కుమార్​ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ గైని గంగారాం సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఉద్యోగ సంఘాలు ప్రముఖ పాత్ర పోషించాయన్నారు. గైనిగంగారాం ఆధ్వర్యంలో ఉద్యోగులు సమరభేరి మోగించారని గుర్తు చేశారు. ​ఎంప్లాయిస్ చేసి రాష్ట్ర ఛైర్మన్ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ హుస్సేని మాట్లాడుతూ. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

1వ తేదీన కలెక్టరేట్​లో భోజన విరామ సమయంలో నిరసన తెలిపాలని సూచించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, టీఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, వ్యవసాయ శాఖ కమిషన్ కార్యవర్గ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి కోలా శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్ టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు టీఎన్జీవో కోశాధికారి నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మూడు దశాబ్దాల కల సాకారమైంది.. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభమైంది..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *