అక్షరటుడే, ఇందూరు : PRC Pending DA | పెండింగ్‌లో ఉన్న డీఏలతో సహా పీఆర్సీ అమలు చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ నిజామాబాద్ (TNGEOS Nizamabad) అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని (Nizamabad) టీఎన్జీవోస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
PRC Pending DA | హెల్త్ స్కీమ్‌ను పటిష్టంగా అమలు చేయాలి
ఎంప్లాయీస్ జేఏసీ (JAC) రాష్ట్ర ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు అధ్యక్షతన జరిగిన టీజీఈజేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సుమన్ జిల్లా పక్షాన మాట్లాడారు. పెండింగ్ బిల్లులను నెలకు రెండు వేల కోట్ల చొప్పున ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు జీతభత్యాలను పెంచాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని, నూతనంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని.. విధివిధానాలు ఖరారు చేయాలని కోరారు. సీపీఎస్‌ను అంతం చేసేందుకు త్వరితగతిన చట్టసభల్లో చర్చించి, తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ కో ఛైర్మన్లు రమేష్, రమణ రెడ్డి, శ్రీకాంత్, కృష్ణారెడ్డి, వైస్ ఛైర్మన్ నేతికుంట, శేఖర్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్, టీఎన్జీవో జిల్లా కోశాధికారి నిరంజన్ గౌడ్, ఆర్‌యూపీపీ జిల్లా సెక్రెటరీ రమణాచారి, టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్, టీఈఎస్ఎస్ఈ జిల్లా కార్యదర్శి తాటి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Dead Body in Car | కారు డిక్కీలో మహిళ మృతదేహం కలకలం