Kamareddy Crime Control | నేర నియంత్రణ, గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి : డీఐజీ సన్‌ప్రీత్ సింగ్

నేర నియంత్రణ, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని జోన్-3 ఇన్​ఛార్జి డీఐజీ, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Crime Control | నేర నియంత్రణ, గంజాయి నిర్మూలనపై(Ganja Eradication) ప్రత్యేక దృష్టి సారించాలని జోన్-3 ఇన్​ఛార్జి డీఐజీ, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కామారెడ్డి (Kamareddy) జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు.

Kamareddy Crime Control | శాంతిభద్రతలపై సమీక్ష

ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లాలో శాంతిభద్రతలు, నేరాల పరిస్థితి, కేసుల నమోదు, దర్యాప్తు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను డీఐజీకి వివరించారు. డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు తగ్గినా మరికొన్ని చోట్ల పెరుగుదల కనిపిస్తోందని, కారణాలను విశ్లేషించి ఫోకసింగ్ అప్రోచ్ తో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ ను బలోపేతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రతి ప్రాంతాన్ని అధికారులు స్వయంగా సందర్శించి కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, సంబంధిత శాఖలతో కలిసి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Kamareddy Crime Control | గంజాయికి బానిసైన వారిని..

గంజాయికి బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ చర్యలు చేపట్టడంతో పాటు సరఫరా, రవాణా మూలాలను ఛేదించాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఐజీ సూచించారు. పోలీసు సిబ్బంది నిజాయితీగా, ధైర్యంగా వంద శాతం సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజల భద్రత కోసం సీసీటీవీ కెమెరాల ఏర్పాటును విస్తరించాలని, పోలీస్ స్టేషన్లలో 5ఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. గుట్కా, మట్కా, అక్రమ గేమింగ్, జూద కార్యకలాపాలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. అనంతరం కామారెడ్డి డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు, కేసు ఫైల్స్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాసరావు, విఠల్ రెడ్డి  పాల్గొన్నారు.

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *