అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Gambling Raid | నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్యనగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Nizamabad Gambling Raid | విశ్వసనీయ సమాచారంతో
పోలీసుల వివరాల ప్రకారం, ఆర్యనగర్‌లో పేకాట నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో చీతా ఫోర్స్ బృందం దాడులు చేపట్టింది. ఘటన స్థలంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం..పరీక్షల్లో అక్రమాలకు ఇక కఠిన శిక్షలు
నిందితుల వద్ద నుంచి రూ.75 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ఆటో, ఒక మోటార్‌సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు నిందితులను నాలుగో టౌన్ పోలీసులకు అప్పగించారు.
Nizamabad Gambling Raid | ప్రత్యేక నిఘా..
ఈ ఘటనపై నాలుగో టౌన్ పోలీసులు సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.