Mallupet Road Accident | జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు..

ఓ కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లి అవతలి వైపు నుంచి వస్తున్న కారును బలంగా ఢీకొంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Mallupet Road Accident | వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లి అవతలి వైపు నుంచి వస్తున్న కారును బలంగా ఢీకొంది. ఈ ఘటనసదాశివనగర్ మండలం  (Sadashivanagar Mandal) మల్లుపేట జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.

Mallupet Road Accident | నిజామాబాద్​ నుంచి కామారెడ్డి వైపు..

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న మహారాష్ట్రకు చెందిన మహీంద్రా కారు మల్లుపేట శివారులోకి రాగానే అదుపుతప్పి డివైడర్​ను ఢీకొంది. డివైడర్​పై నుంచి దూసుకెళ్లిన కారు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న హ్యుందాయ్ కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం కాగా మహీంద్ర కారులో ఉన్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కాగా, హ్యుందాయ్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు కార్లు ఢీకొనడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కార్లను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని కామారెడ్డి జీజీహెచ్​కు తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Crematorium Development | హౌజింగ్ బోర్డు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి తొలగిన అడ్డంకులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *