Mentarajpally road accident | మెంట్రాజ్​పల్లిలో విషాదం.. గల్ఫ్​ నుంచి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి

గల్ఫ్​ నుంచి వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: Mentarajpally road accident | గల్ఫ్​ నుంచి వచ్చి ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన డిచ్‌పల్లి (Dichpally) మండలం సుద్దపల్లి శివారులో చోటుచేసుకుంది.

Mentarajpally road accident |మెంట్రాజ్​పల్లికి చెందిన..

ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం..  మెంట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన గుర్రపు కిషన్ (46) ఆదివారం యానంపల్లి నుంచి సుద్దపల్లి వైపు వస్తుండగా..  యానంపల్లి గ్రామానికి చెందిన జయ్య నవీన్ స్కూటీపై అదే దారిలో వెళ్తున్నారు.  అయితే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎదుట గుంతలను తప్పించే క్రమంలో  రెండు బైక్​లు ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో కిషన్ తలకు తీవ్రగాయాలు కావడంతో భారీగా రక్తస్రావమై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Mentarajpally road accident | గల్ఫ్ నుంచి వచ్చిన కొద్దిరోజులకే విషాదం..

మృతుడు కిషన్ ఇటీవలే గల్ఫ్ దేశం నుంచి స్వగ్రామానికి వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. సుద్దులం వెళ్లి తిరిగి మెంట్రాజ్‌పల్లికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. గల్ఫ్ నుంచి వచ్చిన కొద్దిరోజులకే రోడ్డు ప్రమాదంలో కిషన్ మృతి చెందడంతో మెంట్రాజ్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎవరెస్ట్, ఎల్జీ ఇంగువపై నిషేధం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *